my vidya guru

my vidya guru
AATMODDHARAKA SRI 1008 SRI SATYATMA TIRTHA SRI PADA

Tuesday, January 7, 2014

మూర్ఖజన విజ్ఞాన వేదిక ఖండనము


31-12-2013
పచ్చకామర్లు అయినవాడికి లోకము పచ్చగా కనిపిస్తుంది అని వైద్యశాస్త్రం చెబుతుంది, దేనిగురించి మనిషి తరచు తలచుకుంటాడో, దేనిసంపర్కములో ఉంటాడో ఆ వ్యక్తికి అన్ని అలాగే కనిపిస్తుంది అని మనోశాస్త్రం చెబుతుంది, కుక్క తోకవంకర అన్న సామెతను బట్టి ఒక మూర్ఖుడు ఎంత చెప్పినా, అర్ధం చేపించినా తన విపరీత మార్గాన్ని మార్చుకోడు, తన తప్పుని సరిదిద్దుకోడు. పైన చెప్పిన ఉదహరణలు సామెతలు సరిగ్గా జన విజ్ఞానవేదిక సదస్యులకు అన్వయిస్తుంది.
జన విజ్ఞానవేదిక సదస్యుడు రావు టివి9 చెనల్ లో మంగళగిరి నరసింహ స్వామి సన్నిధానము గురించి జుగుప్సాకరంగా ఉట్టంకించిన విషయము చాలామందికి విదితమే, మనోశాస్త్రానికి అనుగుణంగా ఎల్లప్పుడు టాయిలట్ సంపర్కములో ఉండేటటువంటి వ్యక్తికి నేరుగా భగవంతుడు సాక్షాత్కరించిన, అ దివ్యమంగళస్వరూపము ఒకనీచమైన టాయిలట్ లాగానె కనిపిస్తుంది అది ఆ మూర్ఖుడి మనోదౌర్బల్యం, అదేప్రకారంగా అటువంటి మనోరోగముతో పీడితుడైన రావుగారు సరియైన చికిత్సను చేసుకుంటే మంచిది అని సలహ!
రెండవ విషయము అనవసరమైనా అక్షేపించినది ఉపేక్షించకూడదు అనే అభిప్రాయముతో సమాధానాన్ని చెబుతున్నాను, ఏమిటంటే రావు పోల్చిన ప్రకారంగా చూసిన ఆ ఉదహరణయే తప్పు, టాయిలట్ లో వేసిన నీరు సగం మిగులుతుంది అది ఒక సిస్టమ్, అదే సిస్టమ్ స్వామివారి సన్నిధిలో ఉంది అని చెప్పాడు కాని అలోచించి చూస్తే టాయిలట్ లో ఎంత నీళ్ళు వేస్తె అంత నీళ్ళలో సగము మిగులుతుంది అనడమే తప్పు, వేసిన నీళ్ళలో కొద్దిగా మిగులుతుంది కాని సరిగ్గా సగము మిగలదు, అంతేకాక ఏవైనా గట్టిపదార్థాలు వేస్తె అది అందులోనె మిగులుతుంది కాని మంగళగిరి నరసింహస్వామివారి నోటిలో పటికబెల్లము లేదా బెల్లము వేసినా అది సరిగ్గా సగభాగము స్వీకరించి సగము మనకు ప్రసాదంగా ఇస్తారు, ఇది మనము తెలుసుకోవలసిన తేడా.
మూడవ విషయము ఏమనగా సాటి భారతీయుల తోటి మనుషుల మనోభావాన్ని లెఖ్కచేయక దెబ్బతీసి కృంగతీసిన రావులాంటివాళ్ళను, వాళ్ళకు అవకాశము ఇచ్చిన టివి చేనల్ వారిని ఇటువంటి దురాలోచనలు రాకుండా ఇటువంటి దుష్పచారాలు చేయకుండా కోర్టువారు కఠినంగా దండించి, సజ్జన సముదాయమును న్యాయదేవతను సంతోషపరచవలసినదిగా ప్రార్ధన.
నాలుగవ విషయము రావుగారు మరియు ఇటువంటి నాస్తిక భావనలను ప్రచారము చేసేవాళ్ళు తెలుసుకొని తమ ఆలోచనలను సరిదిద్దుకోవాలి, సమగ్రమైన సిద్ధాంతాలు , వివిధమైన సంస్కృతి సంప్రదాయమువాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకొని, నమ్మి నడుచుకునేది, ఆరాధించేది భగవంతుడిని. ఇటువంటి సర్వసమ్మతుడైన భగవంతుడు సృష్టించిన జగత్తులో ఉంటు ఆ దైవాన్నే తిరస్కరించడము అవమానించడము కన్నా గొప్పఅపరాధము ద్రోహము మరొకటి లేదు. దైవాన్ని నమ్మకుండా లజ్జారహితులై సిగ్గులేకుండా ఆ దైవము సృష్టించిన జగత్తులో ఎలాఉంటున్నారు? “ తిన్న ఇంటి వాసాలు లేక్క పెట్టడమంటే ఇదే”.
చివరిగా మన భారతీయ సంస్కృతిని (సనాతన హిందుధర్మాన్ని) తిరస్కరించడమే ఒక పనిగా పెట్టుకుని ఉన్నవాళ్ళే ఎక్కువ. అన్య ధర్మాలవాళ్ళని తిరస్కరించడము అంటే భయపడతారు. ఈ వైషమ్యము ఎందుకు. ఒక రకంగా మన చేతకాని తనము అని చెప్పవచ్చు. ఈ చేతకానితనమే పోవాలి, చేతనైతే ఇటువంటి ధర్మ విరుద్ధమైన దురాలోచనలు ఖండించాలి లేదా కనీసపక్షము ఇటువంటి మూర్ఖులు, ఇలాంటి ధర్మ విరుద్ధమైన విషయాలని తమ స్వార్ధముకోసము వాడే చ్యానల్ వాళ్ళని సర్వనాశనము చెయ్యి స్వామి అని మంగళగిరి నరసింహస్వామివారిని, మనము నిత్యము ఆరాధించే ఇష్టదైవాన్ని , దేవతలని ప్రార్థించాలి. కనీసము ఇదైన మనము చేయవచ్చుకదా!
యద్ భావం తద్ భవతి” అని చెప్పినప్రకారంగా పరమాత్ముడిని ఏ భావనతో మనము తెలుసుకుంటామో అవే పరిస్థితులు మనకు వాటిల్లుతాయి ఇలా ఉన్నప్పుడు భగవంతుడి విషయములో జుగుప్సాకరంగా మన భావన ఉంటే అదే జుగుప్సితమైన టాయిలట్ గతి కలుగుతుంది కాబట్టి భగవంతుడి యందు మన భావన పవిత్రంగా ఉంటే మనము పవిత్రులమవుతాము.
నరసింహాచార్య సుళీభావి
శ్రీ కృష్ణార్పణమస్తు

नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

No comments:

Post a Comment