my vidya guru

my vidya guru
AATMODDHARAKA SRI 1008 SRI SATYATMA TIRTHA SRI PADA

Thursday, January 16, 2014

శ్రీ త్యాగరాజులవారు ఉపాసన చేసినది ఉపదేశము చేసినది ద్వైతమే !


శ్రీ త్యాగరాజులవారు ఉపాసన చేసినది ఉపదేశము చేసినది ద్వైతమే !
సామాన్యంగా శ్రీ త్యాగరాజులవారి కీర్తనలలో మనము జాగ్రత్తగా గమనించగా మనకు తెలిసే తత్వము వారి కీర్తనలలోనే స్పష్టంగా అర్ధమవుతుంది.
ఇక్కడ వారి కీర్తనలలో రెండు ప్రస్తావించబడినవి.
) సీతమ్మ మా యమ్మ శ్రీ రాముడు మాకు తండ్రి వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనస.
పరమేష వశిష్ఠ పరాషర నారద శౌనక శుక సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు ధర నిజ భాగవతాగ్రేసరు లెవరో వారెల్లరు వర త్యాగరాజునకు పరమ భాంధవులు మనస ….

ఈ కీర్తనలలో జగజ్జనని జనకులు సీతా రాములు (లక్ష్మీ నారాయణులు ) , వాతాత్మజ (హనుమంతుడు) సౌమిత్రి లక్ష్మణుడు , పరమేష (శివుడు), లంబోదరుడు (వినాయకుడు), పరాశర ముని, మొదలైన పరమ భాగవతులు నాకు బంధువులు అని ఈ కీర్తనలలో స్పష్టంగా చెప్పబడినది. ద్వైత సిద్ధాంతము కూడా ఇదే తత్వాన్ని ఉపదేషిస్తుంది ,
అతి మత తమో గిరి సమితి విభేదన పితామహ భూతిద గుణగణ నిలయ ।
శుభ తమ కథాశయ పరమ సదోదిత జగదేక కారణ రామ రమారమణ” రమా రమణుడివైన ఓ రామ నీవే ఈ జతత్తుకు తండ్రివి జగత్తుకి మాత్ర ( మాతా) అయిన రమాదేవి (సీతా అమ్మవారు తల్లి) అని “హరి రేవ జగత్ పితృ మాతృ గతిః” ఇవే మొదలైన ఎన్నో శ్లోకాలలో మనకు ద్వైత సిద్ధాంత స్థాపకులైన శ్రీ మన్ మధ్వాచర్యుల వారు తెలిపారు.
) ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా । చైతన్యమా విను సర్వ సాక్షివై సారము గాను దెల్పుము నాతో ।।
ఈ కీర్తనలలో త్యాగరాజువారు “ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా”సందేహము తీర్చు అని ప్రార్థించి ఇదే కీర్తనలలోనే ఉపసంహారములో
గగన పవన తపన భువనాద్యవనిలో నగధరాజు శివేంద్రాది సురలలో . భగవద్భక్త వరాగ్రే సరులలో బాగ రమించే త్యాగరాజార్చిత “
గగన (ఆకాశము) మొదలగు తత్వాభిమాని దేవతలలో, శివ ఇంద్ర మొదలగు భగవదేభక్తా గ్రేసరులలో రమించే వాడు (రమణ ము చేసేవాడు) అని చేప్పడముతో మనకు స్పష్టంగా తెలిసే తత్వము భగవంతుడు సమగ్ర చేతన అచేతన ప్రంపంచము అంతర్యామిగా ఉంటు రమిస్తాడు అంటే ఆనందగా ఉంటాడు అనగా దుఃఖభూయిష్టమైన చేతనాచేతన ప్రపంచము అంతర్యామిగా ఉన్నను భగవంతుడు శ్రీ రామునికి (నారాయణునికి) దుఃఖము లేదు అని చెప్పారు అంటే దుఃఖించే ప్రపంచము , అంతర్యామిగా ఉన్నా దుఃఖము లేని భగవంతుడికి భేదము ఉంది అంటే ద్వైధి భావము ద్వైతము ఉంది అని అర్థము. ఇదే మాటని ద్వైత సిద్ధాంత స్థాపకులైన శ్రీ మన్ మధ్వాచర్యుల వారు బ్రహ్మసూత్రభాష్యములో
అంతః స్థిత్వా రమణకృద్ అంతరః స ఉదాహృతః“ “ ఆత్మా అంతరాత్మ ఇతి హరి రేకః“అంటే సమస్త సమగ్ర చేతన అచేతన ప్రంపంచము అంతర్యామిగా ఉంటు రమిస్తాడు అంటే ఆనందగా ఉంటాడు. అని అర్ధమవుతుంది.
దీనితో మనకు తెలిసేది ఏమనగా శ్రీ త్యారాజులవారు వారి కీర్తనలలో ఉపాసన చేసినది ఉపదేశము చేసినది ద్వైతమే !
శ్రీ మన్ మధ్వాచర్య హృత్ కమల నివాసి శ్రీ కృష్ణార్పణమస్తు
నరసింహాచార్య సుళీభావి

नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

Monday, January 13, 2014

idol worship!

what is  an idol?
A) idol is a person or material which have a divya vibhuti rupamu sannidhanam of the all-mighty lord narayana. in the world in every where the lord is there but in few things only the lord had kept a vibhuti rupam.
the idols are two types 1) chetana 2) achetana
1) chetana- a scholar or a person who is having perfect divine knowledge of the all-mighty, in other words jnanis are the chetana vigrahamlu of the all-mighty. in this type of chetana vigraha the all-mighty's sannidhana is always present (nitya sannidhana) from goddess laksmi,brahma, rudra, indra and all the jnanis rushi munulu, divine trees, cows come under this category of chetana vigraha.
2) Achetana vigraha is of two type, 1) sahaja 2) aahita
                   1. sahaja achetana pratima of lord narayana are the 24 tatvas, pachabhutamulu, brahamdam, rivers, oceans, grahas, nakshatras, saligraamas, parvatas, sarovaras,pshkarinis etc., in these sahaja achetana pratima there is no need of ahwana vidhi, (natural pratimas of lord narayana)
                  2.) aahita achetana pratima are those in which we do ahwanam or vigraha pratisthapanam accordingly as told in vedas, here if we won't maintain shuddhi the sannidhana of the deity will be lost.
so when u understand this fact it comes to a conclusion that vigraha aaradhana in not a mean thing, it is a shastra sammata worship.
नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

yato vaacho nivartante apraapya manasaa saha

lord krishna is the anant guna poorna parabrahma swaruupa is a proven fact by shastras, vedas etc.,, and also accepted fact by all the deities like goddess jagat janani lakshmi ammvaru, jagat pita chaturmukha brahma devudu, pralaya karta lord shiva (ganga dhara) and all other devatas , rushulu etc.,.  this we can know by their statements which we can see in all puranas, vedas, mahabharata etc.,, not only this lord krishna himself admits and proves that he is the only parabrahma swaroopa the all-mighty, no one else is mightier than him by saying
 మత్తః  పరతరం న అన్యత్ కించిత్ అస్తి ధనంజయ, by all the acceptable verses in shastras is the one which we should follow, tasmaat shaastram pramaanam te karya akaarya vyavasthitou. 
so all the shaastra aadhaaramulu prove that there is only one guna poorna brahma that is sri man narayana, there is no other brahma which u referred as nirguna brahma, or the light like thing, what ever we say or do upasanam it should be accepted by shastra, what we think or do is not important, what the moola shastra or  scriptures say or prove is most important. such a thing is to be followed.
shastra (ITAREYA UPANISHAT AND OTHER PRAMANAMULU)  says that nirguna brahma upasana will bring anartha also,  
ANJANEYA,PRAHLAD, DHRUVA AND MANY OTHER BHAKTAS LIKE NAARADA MAHARSHI ALSO HAD SEEN AND EXPERIENCED THE ANANTA GUNA PARIPOORNA BRAHMA SWAROOPA, NOT NIRGUNA BRAHMA SWAROOPA. SO, THEY ARE THE REAL GUIDERS IN ADHYATMIKA MAARGAMU. they have seen saakara brahma with hands, legs and all other senses and rupamu.
veda and all other shastra can't explain parbrahma completely, this does'nt mean that the vedas and other scriptures explain nothing about parabrahma, they do explain some of the qualities of parabrahma, if they nothing explain about parabrahma then they will be use less. in brief vedas, puranas and all scriptures do explain many things related to parabrahma but completely in whole some they can't explain everything of parabrahma. this is the meaning of the vedic verse 
yato vaacho nivartante apraapya manasa saha (tittyriya upanishat)

नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

what is self realization?

what is known as self realization, does it mean becoming brahma or reaching the parabrahmas abode called vaikuntha lokam,firstly who is not brahma now that is jiva will never become brahma (lord lakshmipati narayana) secondly as told  by krishna  
జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః । త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం యేతి సోऽర్జున ।।  4th chap geeta
reaching the permanent abode of lord krishna or narayana means reaching the moksha loka this is what means self realization (మన స్వరూపానికి సంబంధించిన ఆనందాన్ని మోక్షలోకములో పొందడము భగవంతుని పాదాలు చేరడము) this is known as salvation, many jivas who had already attained salvation మోక్షము పొందిన జీవులను స్వయంముగా చతుర్ముఖ బ్రహ్మ దేవుడు . నారద మహర్శి చూసిన ఉల్లేఖము భాగవతాది శాస్త్రాలలో మనకు దొరుకుతుంది.
jivas who attained salvation never return back from vaikuntha lokam, in vaikuntha lokamu they have infinite anandamu, solace, sukha bhogamulu, what ever they want it will be readily reach them, the mukta jivas do have senses, legs, hands overall (ఆప్రాకృత శరీరము), 2nd skanda bhagavata expalins the same about mukta jivulu, explains about them having a beautiful శరీరము ( శ్యామావదాతా శతపత్ర లోచనాః) means neel megha shyama varnam , eyes as the lotus patramulu etc.,, but not exactly as lord narayana, the mukta jivas do have the apraakruta shariramu which look alike of lord narayanas rupam, but not exactly as of lord narayanas or goddess lakshmi maata. this fact is clearly explained in garda puranam brahma kaandamu also.
 what do yo mean by the question not arising of rama krishna, shabhu etc.,  does it mean there is no discrimination between the gods, or the deities referred above does'nt exist, or we don't need to worship them? 
firstly the above referred deities are different by each other, means the existence of the above referred gods is a proven fact in all the puranams and veda shastras, that too there is a taratamya (discrimination) stated as lord narayana is the father, goddess lakshmi is our mother, brahma and mukhya vayu deva are our brothers, saraswati and bharati devi are our (jiva's)  sister-in-laws, shiva and other devatas are our relations(bandhvulu), this is expalined in tyagarajugari song
 సీతమ్మ మా యమ్మ శ్రీ రాముడు మాకు తండ్రి, వాతాత్మజ సౌమిత్రి .........పరమేశ వసిష్ఠ ........... నిజభాగవతాగ్రే సరు లెవరో వారెల్లరు పరమ భాంధవులు మనసా. 
the same is told in shastras, we should have the devotion with taaratamya towards other devatas also (garuda purana brahma kaandamu ) proves the same fact.
in vishnu sahasra naama there are many names which are famously known as lord shivas name are in true fact lord narayanas names only, not only lord shivas names but also lord brahma ,agni, indra all other deities names are in true fact lord narayana's names only, lord narayan has given his own self names to all other deities, (bhagavat 1st skanda explains and proves logically the above fact) narayana upanishat also says the same  (యో దేవానాం నామధా ఏక ఏవ ),  brahma sutras also prove the same fact. 
on this if you have any doubts you are welcome.
మనము ఏ విషయాన్ని తెలిపినా అధారాలు చాలా ముఖ్యము, ఆధారాలు లేదా శాస్త్ర ప్రమాణాలు చాలా ముఖ్యము. 
नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

Tuesday, January 7, 2014

సర్వేశ్వరుడు సర్వరక్షకుడైన భగవంతుడికి సెక్యురిటి సిస్టమ్ ఎందుకు?


సర్వేశ్వరుడు సర్వరక్షకుడైన భగవంతుడికి సెక్యురిటి సిస్టమ్ ఎందుకు?
2-1-2014
సర్వరక్షకుడైన భగవంతుడికి సెక్యురిటి సిస్టమ్ ఎందుకు, తనను తనే రక్షించుకోలేని వాడు మనలని ఏమి రక్షిస్తాడు ? అని కొంతమంది అజ్ఞానులు వితండవాదము చేస్తారు, ఇటువంటి నిరర్ధకమైన వితండాలకి భగవద్గీత మరియు భాగవతము సమాధానము చెబుతుంది.
      1. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్” అని అర్జునుడికి ఆదేశిస్తూ భీష్మాదుల సంహారాన్ని నేను విశ్వరూపాన్ని చూపించే సందర్భములో నీవుచూసావు ఇప్పుడు అదే భీష్మాదులను కించిత్ బలశేషముతో నీ ముందు నిలబెట్టాను వారిని నామమాత్రానికి సంహరించి కీర్తిని నీవు పొందు, అని భీష్మాదులను సంహరించే సందర్భానికి అర్జునుడిని ఎలాగైతే నిమిత్తమాత్రం చేసాడో అదే క్రమములో పాండవపక్షీయులను రక్షించడానికి అదే అర్జునాదులను నిమిత్తమాత్రం చేసాడు. దీనితో మనకు తెలిసే విషయము ఏమనగా దేవదేవునికి ఒకరిని రక్షించాలన్న లేదా శిక్షించాలన్న వేరొకరి అవసరము లేకపోయినా వేరొకరికి కీర్తి రావడానికి లేదా మరొక ఉద్దేశముతో భగవంతుడు ఇతరులను నిమిత్తమాత్రం చేస్తాడు. అది సర్వతంత్ర స్వతంత్రుడైన భగవంతుడి సంకల్పము ఆ సంకాల్పాన్ని ఎందిరించే హక్కు , తిరస్కరించే హక్కు మరొకరికి లేదు. భక్తితో తెలుసుకోడానికి ప్రయత్నము మాత్రము మనము చేయగలము.
      2. భగవంతుడు అన్నివేళల నేరుగా ప్రత్యక్షంగా వచ్చి రక్షించడు, ఒక వ్యక్తిని లేదా వస్తువుని రక్షించడానికి మరొక వ్యక్తిని లేదా వస్తువుని నిమిత్తము చేస్తాడు. ఈ సత్యాన్ని మనము ప్రతినిత్యము నిదర్శనాలతో మనము చూస్తూంటాము. వసిపాపలని రక్షించడానికి కన్న తల్లిదండ్రులను నిమిత్తము చేస్తాడు, దూడని రక్షించడానికి ఆవుని నిమిత్తము చేస్తాడు, ఆవుని రక్షించడానికి గోపాలుని నిమిత్తము చేస్తే సజ్జనులను భగవత్భక్తులను రక్షించడానికి గురువులను నిమిత్తము చేస్తాడు.
స్వయమేవాఖిల జగద్రక్షాద్యమిత శక్తిమాన్ ।
అప్యచ్యుతో గురుద్వారా ప్రసాద కృదహంత్వితి ।।
ద్వైత సిద్ధాంత స్ధాపకులు శ్రీ మన్ మధ్వాచార్యులు వారు ఈ పురాణ వచనముతో మనకు తెలియజేస్తారు .
జగత్తును రక్షించడానికి దేవతలను నిమిత్తము చేస్తాడు, అందరిలోను అన్నివస్తువులలోను స్వయంగా దేవదేవుడు శ్రీనివాసుడు ఉంటు రక్షిస్తూంటాడు అను సత్యము అష్టమస్కంధ భాగవతములో సముద్రమథన ఘట్టములో జగద్విదితమైన ప్రత్యక్ష నిదర్శనము నిరూపిస్తుంది.
దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి తన రక్షణ కొరకు ఇతరుల అవసరము లేకపోయినా సెక్యురిటి సిస్టమ్, సెక్యురిటి భటులను నిమిత్తమాత్రం చేస్తాడు. కావున వ్యర్ధమైన వితండాలకి లొంగక శుద్ధమైన భక్తితో భగవంతుడిని సేవించి మన అల్ప ఆయుష్యును సార్ధకము చేసుకోగలరని ఆశిస్తున్నాను.
శ్రీ కృష్ణార్పణమస్తు
నరసింహాచార్య సుళీభావి


नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

మూర్ఖజన విజ్ఞాన వేదిక ఖండనము


31-12-2013
పచ్చకామర్లు అయినవాడికి లోకము పచ్చగా కనిపిస్తుంది అని వైద్యశాస్త్రం చెబుతుంది, దేనిగురించి మనిషి తరచు తలచుకుంటాడో, దేనిసంపర్కములో ఉంటాడో ఆ వ్యక్తికి అన్ని అలాగే కనిపిస్తుంది అని మనోశాస్త్రం చెబుతుంది, కుక్క తోకవంకర అన్న సామెతను బట్టి ఒక మూర్ఖుడు ఎంత చెప్పినా, అర్ధం చేపించినా తన విపరీత మార్గాన్ని మార్చుకోడు, తన తప్పుని సరిదిద్దుకోడు. పైన చెప్పిన ఉదహరణలు సామెతలు సరిగ్గా జన విజ్ఞానవేదిక సదస్యులకు అన్వయిస్తుంది.
జన విజ్ఞానవేదిక సదస్యుడు రావు టివి9 చెనల్ లో మంగళగిరి నరసింహ స్వామి సన్నిధానము గురించి జుగుప్సాకరంగా ఉట్టంకించిన విషయము చాలామందికి విదితమే, మనోశాస్త్రానికి అనుగుణంగా ఎల్లప్పుడు టాయిలట్ సంపర్కములో ఉండేటటువంటి వ్యక్తికి నేరుగా భగవంతుడు సాక్షాత్కరించిన, అ దివ్యమంగళస్వరూపము ఒకనీచమైన టాయిలట్ లాగానె కనిపిస్తుంది అది ఆ మూర్ఖుడి మనోదౌర్బల్యం, అదేప్రకారంగా అటువంటి మనోరోగముతో పీడితుడైన రావుగారు సరియైన చికిత్సను చేసుకుంటే మంచిది అని సలహ!
రెండవ విషయము అనవసరమైనా అక్షేపించినది ఉపేక్షించకూడదు అనే అభిప్రాయముతో సమాధానాన్ని చెబుతున్నాను, ఏమిటంటే రావు పోల్చిన ప్రకారంగా చూసిన ఆ ఉదహరణయే తప్పు, టాయిలట్ లో వేసిన నీరు సగం మిగులుతుంది అది ఒక సిస్టమ్, అదే సిస్టమ్ స్వామివారి సన్నిధిలో ఉంది అని చెప్పాడు కాని అలోచించి చూస్తే టాయిలట్ లో ఎంత నీళ్ళు వేస్తె అంత నీళ్ళలో సగము మిగులుతుంది అనడమే తప్పు, వేసిన నీళ్ళలో కొద్దిగా మిగులుతుంది కాని సరిగ్గా సగము మిగలదు, అంతేకాక ఏవైనా గట్టిపదార్థాలు వేస్తె అది అందులోనె మిగులుతుంది కాని మంగళగిరి నరసింహస్వామివారి నోటిలో పటికబెల్లము లేదా బెల్లము వేసినా అది సరిగ్గా సగభాగము స్వీకరించి సగము మనకు ప్రసాదంగా ఇస్తారు, ఇది మనము తెలుసుకోవలసిన తేడా.
మూడవ విషయము ఏమనగా సాటి భారతీయుల తోటి మనుషుల మనోభావాన్ని లెఖ్కచేయక దెబ్బతీసి కృంగతీసిన రావులాంటివాళ్ళను, వాళ్ళకు అవకాశము ఇచ్చిన టివి చేనల్ వారిని ఇటువంటి దురాలోచనలు రాకుండా ఇటువంటి దుష్పచారాలు చేయకుండా కోర్టువారు కఠినంగా దండించి, సజ్జన సముదాయమును న్యాయదేవతను సంతోషపరచవలసినదిగా ప్రార్ధన.
నాలుగవ విషయము రావుగారు మరియు ఇటువంటి నాస్తిక భావనలను ప్రచారము చేసేవాళ్ళు తెలుసుకొని తమ ఆలోచనలను సరిదిద్దుకోవాలి, సమగ్రమైన సిద్ధాంతాలు , వివిధమైన సంస్కృతి సంప్రదాయమువాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకొని, నమ్మి నడుచుకునేది, ఆరాధించేది భగవంతుడిని. ఇటువంటి సర్వసమ్మతుడైన భగవంతుడు సృష్టించిన జగత్తులో ఉంటు ఆ దైవాన్నే తిరస్కరించడము అవమానించడము కన్నా గొప్పఅపరాధము ద్రోహము మరొకటి లేదు. దైవాన్ని నమ్మకుండా లజ్జారహితులై సిగ్గులేకుండా ఆ దైవము సృష్టించిన జగత్తులో ఎలాఉంటున్నారు? “ తిన్న ఇంటి వాసాలు లేక్క పెట్టడమంటే ఇదే”.
చివరిగా మన భారతీయ సంస్కృతిని (సనాతన హిందుధర్మాన్ని) తిరస్కరించడమే ఒక పనిగా పెట్టుకుని ఉన్నవాళ్ళే ఎక్కువ. అన్య ధర్మాలవాళ్ళని తిరస్కరించడము అంటే భయపడతారు. ఈ వైషమ్యము ఎందుకు. ఒక రకంగా మన చేతకాని తనము అని చెప్పవచ్చు. ఈ చేతకానితనమే పోవాలి, చేతనైతే ఇటువంటి ధర్మ విరుద్ధమైన దురాలోచనలు ఖండించాలి లేదా కనీసపక్షము ఇటువంటి మూర్ఖులు, ఇలాంటి ధర్మ విరుద్ధమైన విషయాలని తమ స్వార్ధముకోసము వాడే చ్యానల్ వాళ్ళని సర్వనాశనము చెయ్యి స్వామి అని మంగళగిరి నరసింహస్వామివారిని, మనము నిత్యము ఆరాధించే ఇష్టదైవాన్ని , దేవతలని ప్రార్థించాలి. కనీసము ఇదైన మనము చేయవచ్చుకదా!
యద్ భావం తద్ భవతి” అని చెప్పినప్రకారంగా పరమాత్ముడిని ఏ భావనతో మనము తెలుసుకుంటామో అవే పరిస్థితులు మనకు వాటిల్లుతాయి ఇలా ఉన్నప్పుడు భగవంతుడి విషయములో జుగుప్సాకరంగా మన భావన ఉంటే అదే జుగుప్సితమైన టాయిలట్ గతి కలుగుతుంది కాబట్టి భగవంతుడి యందు మన భావన పవిత్రంగా ఉంటే మనము పవిత్రులమవుతాము.
నరసింహాచార్య సుళీభావి
శ్రీ కృష్ణార్పణమస్తు

नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa