my vidya guru

my vidya guru
AATMODDHARAKA SRI 1008 SRI SATYATMA TIRTHA SRI PADA

Tuesday, January 7, 2014

సర్వేశ్వరుడు సర్వరక్షకుడైన భగవంతుడికి సెక్యురిటి సిస్టమ్ ఎందుకు?


సర్వేశ్వరుడు సర్వరక్షకుడైన భగవంతుడికి సెక్యురిటి సిస్టమ్ ఎందుకు?
2-1-2014
సర్వరక్షకుడైన భగవంతుడికి సెక్యురిటి సిస్టమ్ ఎందుకు, తనను తనే రక్షించుకోలేని వాడు మనలని ఏమి రక్షిస్తాడు ? అని కొంతమంది అజ్ఞానులు వితండవాదము చేస్తారు, ఇటువంటి నిరర్ధకమైన వితండాలకి భగవద్గీత మరియు భాగవతము సమాధానము చెబుతుంది.
      1. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్” అని అర్జునుడికి ఆదేశిస్తూ భీష్మాదుల సంహారాన్ని నేను విశ్వరూపాన్ని చూపించే సందర్భములో నీవుచూసావు ఇప్పుడు అదే భీష్మాదులను కించిత్ బలశేషముతో నీ ముందు నిలబెట్టాను వారిని నామమాత్రానికి సంహరించి కీర్తిని నీవు పొందు, అని భీష్మాదులను సంహరించే సందర్భానికి అర్జునుడిని ఎలాగైతే నిమిత్తమాత్రం చేసాడో అదే క్రమములో పాండవపక్షీయులను రక్షించడానికి అదే అర్జునాదులను నిమిత్తమాత్రం చేసాడు. దీనితో మనకు తెలిసే విషయము ఏమనగా దేవదేవునికి ఒకరిని రక్షించాలన్న లేదా శిక్షించాలన్న వేరొకరి అవసరము లేకపోయినా వేరొకరికి కీర్తి రావడానికి లేదా మరొక ఉద్దేశముతో భగవంతుడు ఇతరులను నిమిత్తమాత్రం చేస్తాడు. అది సర్వతంత్ర స్వతంత్రుడైన భగవంతుడి సంకల్పము ఆ సంకాల్పాన్ని ఎందిరించే హక్కు , తిరస్కరించే హక్కు మరొకరికి లేదు. భక్తితో తెలుసుకోడానికి ప్రయత్నము మాత్రము మనము చేయగలము.
      2. భగవంతుడు అన్నివేళల నేరుగా ప్రత్యక్షంగా వచ్చి రక్షించడు, ఒక వ్యక్తిని లేదా వస్తువుని రక్షించడానికి మరొక వ్యక్తిని లేదా వస్తువుని నిమిత్తము చేస్తాడు. ఈ సత్యాన్ని మనము ప్రతినిత్యము నిదర్శనాలతో మనము చూస్తూంటాము. వసిపాపలని రక్షించడానికి కన్న తల్లిదండ్రులను నిమిత్తము చేస్తాడు, దూడని రక్షించడానికి ఆవుని నిమిత్తము చేస్తాడు, ఆవుని రక్షించడానికి గోపాలుని నిమిత్తము చేస్తే సజ్జనులను భగవత్భక్తులను రక్షించడానికి గురువులను నిమిత్తము చేస్తాడు.
స్వయమేవాఖిల జగద్రక్షాద్యమిత శక్తిమాన్ ।
అప్యచ్యుతో గురుద్వారా ప్రసాద కృదహంత్వితి ।।
ద్వైత సిద్ధాంత స్ధాపకులు శ్రీ మన్ మధ్వాచార్యులు వారు ఈ పురాణ వచనముతో మనకు తెలియజేస్తారు .
జగత్తును రక్షించడానికి దేవతలను నిమిత్తము చేస్తాడు, అందరిలోను అన్నివస్తువులలోను స్వయంగా దేవదేవుడు శ్రీనివాసుడు ఉంటు రక్షిస్తూంటాడు అను సత్యము అష్టమస్కంధ భాగవతములో సముద్రమథన ఘట్టములో జగద్విదితమైన ప్రత్యక్ష నిదర్శనము నిరూపిస్తుంది.
దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి తన రక్షణ కొరకు ఇతరుల అవసరము లేకపోయినా సెక్యురిటి సిస్టమ్, సెక్యురిటి భటులను నిమిత్తమాత్రం చేస్తాడు. కావున వ్యర్ధమైన వితండాలకి లొంగక శుద్ధమైన భక్తితో భగవంతుడిని సేవించి మన అల్ప ఆయుష్యును సార్ధకము చేసుకోగలరని ఆశిస్తున్నాను.
శ్రీ కృష్ణార్పణమస్తు
నరసింహాచార్య సుళీభావి


नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

No comments:

Post a Comment