శ్రీ
త్యాగరాజులవారు ఉపాసన చేసినది
ఉపదేశము చేసినది ద్వైతమే !
సామాన్యంగా
శ్రీ త్యాగరాజులవారి కీర్తనలలో
మనము జాగ్రత్తగా గమనించగా
మనకు తెలిసే తత్వము వారి
కీర్తనలలోనే స్పష్టంగా
అర్ధమవుతుంది.
ఇక్కడ
వారి కీర్తనలలో రెండు
ప్రస్తావించబడినవి.
౧)
సీతమ్మ
మా యమ్మ శ్రీ రాముడు మాకు
తండ్రి వాతాత్మజ సౌమిత్రి
వైనతేయ రిపుమర్దన ధాత భరతాదులు
సోదరులు మాకు ఓ మనస.
పరమేష
వశిష్ఠ పరాషర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతాగ్రేసరు లెవరో
వారెల్లరు వర త్యాగరాజునకు
పరమ భాంధవులు మనస ….
ఈ కీర్తనలలో
జగజ్జనని జనకులు సీతా రాములు
(లక్ష్మీ
నారాయణులు )
, వాతాత్మజ
(హనుమంతుడు)
సౌమిత్రి
లక్ష్మణుడు ,
పరమేష
(శివుడు),
లంబోదరుడు
(వినాయకుడు),
పరాశర
ముని,
మొదలైన
పరమ భాగవతులు నాకు బంధువులు
అని ఈ కీర్తనలలో స్పష్టంగా
చెప్పబడినది.
ద్వైత
సిద్ధాంతము కూడా ఇదే తత్వాన్ని
ఉపదేషిస్తుంది ,
“అతి
మత తమో గిరి సమితి విభేదన
పితామహ భూతిద గుణగణ నిలయ ।
శుభ తమ
కథాశయ పరమ సదోదిత జగదేక కారణ
రామ రమారమణ” రమా రమణుడివైన
ఓ రామ నీవే ఈ జతత్తుకు తండ్రివి
జగత్తుకి మాత్ర (
మాతా)
అయిన
రమాదేవి (సీతా
అమ్మవారు తల్లి)
అని
“హరి రేవ జగత్ పితృ మాతృ గతిః”
ఇవే మొదలైన ఎన్నో శ్లోకాలలో
మనకు ద్వైత సిద్ధాంత స్థాపకులైన
శ్రీ మన్ మధ్వాచర్యుల వారు
తెలిపారు.
౨)
ద్వైతము
సుఖమా అద్వైతము సుఖమా ।
చైతన్యమా విను సర్వ సాక్షివై
సారము గాను దెల్పుము నాతో ।।
ఈ కీర్తనలలో
త్యాగరాజువారు “ద్వైతము
సుఖమా అద్వైతము సుఖమా”సందేహము
తీర్చు అని ప్రార్థించి ఇదే
కీర్తనలలోనే ఉపసంహారములో
“గగన
పవన తపన భువనాద్యవనిలో నగధరాజు
శివేంద్రాది సురలలో .
భగవద్భక్త
వరాగ్రే సరులలో బాగ రమించే
త్యాగరాజార్చిత “
గగన
(ఆకాశము)
మొదలగు
తత్వాభిమాని దేవతలలో,
శివ
ఇంద్ర మొదలగు భగవదేభక్తా
గ్రేసరులలో రమించే వాడు (రమణ
ము చేసేవాడు)
అని
చేప్పడముతో మనకు స్పష్టంగా
తెలిసే తత్వము భగవంతుడు సమగ్ర
చేతన అచేతన ప్రంపంచము అంతర్యామిగా
ఉంటు రమిస్తాడు అంటే ఆనందగా
ఉంటాడు అనగా దుఃఖభూయిష్టమైన
చేతనాచేతన ప్రపంచము అంతర్యామిగా
ఉన్నను భగవంతుడు శ్రీ రామునికి
(నారాయణునికి)
దుఃఖము
లేదు అని చెప్పారు అంటే దుఃఖించే
ప్రపంచము ,
అంతర్యామిగా
ఉన్నా దుఃఖము లేని భగవంతుడికి
భేదము ఉంది అంటే ద్వైధి భావము
ద్వైతము ఉంది అని అర్థము.
ఇదే
మాటని ద్వైత సిద్ధాంత స్థాపకులైన
శ్రీ మన్ మధ్వాచర్యుల వారు
బ్రహ్మసూత్రభాష్యములో
“ అంతః
స్థిత్వా రమణకృద్ అంతరః స
ఉదాహృతః“ “ ఆత్మా అంతరాత్మ
ఇతి హరి రేకః“అంటే సమస్త సమగ్ర
చేతన అచేతన ప్రంపంచము అంతర్యామిగా
ఉంటు రమిస్తాడు అంటే ఆనందగా
ఉంటాడు.
అని
అర్ధమవుతుంది.
దీనితో
మనకు తెలిసేది ఏమనగా శ్రీ
త్యారాజులవారు వారి కీర్తనలలో
ఉపాసన చేసినది ఉపదేశము
చేసినది ద్వైతమే !
శ్రీ
మన్ మధ్వాచర్య హృత్ కమల నివాసి
శ్రీ కృష్ణార్పణమస్తు
నరసింహాచార్య
సుళీభావి
नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa
No comments:
Post a Comment