శ్రాద్ధానికి నల్లని నువ్వులు, సరియు దర్భములను తప్పనిసరిగా ఎందుకు వాడతారు?
ఈ
ప్రశ్న చాలామందికి వచ్చి
ఉండోచ్చు, అలాగె
చాలామంది ఈ విషయాన్ని
పట్టించుకోకుండా ఉండోచ్చు,
రెండవ క్రోవకి
చెందిన వారిని మనము పట్టించుకోకుండా
ఉండడమే మేలు. "శ్రాద్ధము"
అనే శబ్దములోనె
శ్రద్ధతో చేయవలసినది (యత్
శ్రద్ధయా క్రీయతె తత్ శ్రాద్ధం),
కాని నేటి
సమాజములో చాలామందికి శ్రద్ధ
లేదు, ఏదో
మొక్కుబడిగా ముగించాము అని
అనిపించుతారె తప్ప ఏమి చేసాము,
ఎందుకు చేసాము
అనేదె తెలియదు.
జన్మదాతల
ఋణము శరీరము చనిపోయేంతవరకు
ఉంటుంది,
కాబట్టే
మన తల్లిదండ్రులు చనిపోయాక
కూడా, వారి
పాంచభౌతిక శరీరము నశించినా
వారి ఋణమును తీర్చుకొనుటకు
మనము వారి తదనంతరము మరియు
మనము జీవించి ఉన్నంతవరకు
వారి కోసము శ్రాద్ధ తర్పణాదులు
చేయవలసినదే!.
ఈ
శ్రాద్ధ తర్పణాదులు అనగా
మనకు గుర్తు వచ్చేదె నల్ల
నువ్వులు మరియు దర్భములు.
ఈ రెండు
మనము శ్రాద్ధాని కార్యాలలో
ఎందుకు వాడాలి అన్నదానికి
కొన్ని సమాధానములు ఇచ్చట
ప్రస్తావించుచున్నాను.
గరుడునికి శ్రీ మహావిష్ణువు ఇలా ఉపదేశించారు.
మమ
స్వేదసముద్భూతాః తిలాః
తార్క్ష్య పవిత్రకాః |
అసురాః
దానవా దైత్యా విద్రవన్తి
తిలైస్తథా ||
తిలాః
శ్వేతాః తిలాః కృష్ణాః తిలాః
గోమూత్ర సన్నిభాః |
దహన్తు
తే మే పాపాని శరీరేణ కృతాని
వై ||
ఏకఏవ
తిలో దత్తో హేమద్రోణ
తిలైః సమః |
తర్పణె
దానహోమేషు దత్తో భవతి అక్షయః
||
భావము-
నువ్వులు
మూడురకాలు తెలుపు,
నలుపు
మరియు గోమూత్రమువలె బంగారు
రంగులో ఉండును.
ఏ
రంగు నువ్వులు (తిలము)
అయినను,
తిలము
ఇది చిన్మయుడైన నిర్దోషుడు,
అనంత
గుణపూర్ణుడు అయిన జగత్స్వామి
శ్రమరహితుడు అయిన శ్రీ
మన్నారయణుని స్వేదము చే
సృష్టించబడినది.
కావున
ఇట్టి తిలములను ఒకటైననూ
శ్రాద్ధములో సమర్పితమైననూ
బంగారు కుంభంలో నింపిన సువర్ణ
తిలములను దానము ఇచ్చినంత
పుణ్యము,
అక్షయమైన
ఫలమును ప్రసాదించును,
అంతే
కాకుండ ఎచట తిలములు ఉండునో
అచట దైత్యులు,
పిశాచాలు,
రాక్షసులు
మొదలగువారు పారిపోదురు,
తన్నిమిత్తంగా
నిర్విఘ్నముగా చేపట్టిన
కార్యము సమాప్తి చెందును.
మన
శరీరముచే చేసిన పాపములు
అన్నియు నశించును.
కావున
మనము శ్రాద్ధము మొదలగు కర్మముల
ఎందు తిలములను వాడుట పరిపాటి,
సంప్రదాయము.
ఇక
దర్భముల వైశిష్ట్యము
తెలుసుకుందాము.
దర్భాః
రోమసముద్భూతాః తిలాః స్వేదేషు
నాన్యథా |
దెవతా
దానవాః తృప్తాః శ్రాద్ధేన
పితరస్తథా ||
ప్రయోగవిధినా
బ్రహ్మా విశ్వం చాప్యుప
జీవనాత్ |
అపసవ్యాదితో
బ్రహ్మా పితరో దేవదేవతాః ||
తేన
తె పితరః తృప్తా అపసవ్యే కృతె
సతి |
దర్భమూలె
స్థితో బ్రహ్మా మధ్యే దేవో
జనార్ధనః ||
దర్భాగ్రే
శఙ్కరం విద్యాత్ త్రయో దేవాః
కుశే స్మృతాః |
విప్రా
మన్త్రాః కుశా వహ్నిస్తులసీ
చ ఖగేశ్వర ||
నైతె
నిర్మాల్యతాం యాన్తి క్రియమాణాః
పునఃపునః |
తులసీ
బ్రాహ్మణా గావో విష్ణురేకాదశి
ఖగ ||
పఞ్చ
ప్రవహణాన్యేవ భవాబ్ధౌ మజ్జతాం
నృణామ్ |
విష్ణురేకాదశీ
గీతా తులసీ విప్రధేనవః ||
భావము-
తిలములు
భగవంతుని
చిన్మయుడైన
నిర్దోషుడు,
అనంత
గుణపూర్ణుడు అయిన జగత్స్వామి
శ్రమరహితుడు అయిన శ్రీ
మన్నారయణుని స్వేదము చే
సృష్టించబడినది,
అటులనే
దర్భములు భగవంతుని రోముమలనుండి
సృష్టించబడినవి.
ఇట్టి
దర్భములను శ్రాద్ధవిధిలో
మంత్ర సహితంగా ఉపయోగించినచో
సమగ్ర సజ్జన సముదాయము,
సమస్త
విశ్వము,
పితృదేవతలు,
దేవతోత్తములు
తృప్తి చెందురు.
అపసవ్యమును
ఒనర్చినచో ఉపజీవించురు
సంతోషించుదురు,
సంతృప్తి
చెందురు.
కావున
మనము శ్రాద్ధము చేయు సందర్భములో
మంత్ర మంత్రానికి అపసవ్యము
ఒనర్చుదము.
దర్భముయొక్క
మూలభాగమున చతుర్ముఖ బ్రహ్మదేవుడు,
మధ్యభాగములో
శ్రీ మన్నారాయణుడు,
అగ్రభాగమున
రుద్రదేవుడు సన్నిహితులై
ఉండురు.
త్రిమూర్తుల
సన్నిధానముతో పవిత్రమైన
దర్భము ఉన్నచోట పిశాచముల,
దుష్టశక్తుల
పీడ ఉండదు.
కావున
దర్భములు ఉన్నచోట శుభములు
కలుగును.
- బ్రాహ్మణులు, మన్త్రములు, దర్భములు, అగ్ని, తుళసీ వీటికి మైలము, అశుద్ధి మొదలగు దోషములు లేవు.
- అలాగే తుళసి, బ్రాహ్మణులు, గోవులు, శ్రీ మహావిష్ణువు, ఎకాదశి నిర్జల ఉపవాసము ఇవి అయిదు భవసాగరములో మునిగి నశించు మానవమాత్రులకు, ఒక పడవవలె ఆశ్రయము ఇచ్చి భవసాగరమును దాటించును.
- శ్రీ మహావిష్ణువు, ఎకాదశి ఉపవాసము, భగవద్గీతా, తుళసి, బ్రాహ్మణులు, గోమాతలు ఈఆరు మోక్షమును ప్రసాదించును.
- అసారమైన , అశుద్ధమైన ఈ సంసారములో అత్యంత పవిత్రమైనవి తిలములు, దర్భములు మరియు తుళసి. మనకు సంభవించు దుర్గతునుండి రక్షించును.
సర్వ
పితృంతర్గత భారతీ రమణ శ్రీ
ముఖ్యప్రాణాంతర్గత శ్రీ
కృష్ణార్పణమస్తు
नरसिंहाचार्य सुळिभाविमठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa
No comments:
Post a Comment