my vidya guru

my vidya guru
AATMODDHARAKA SRI 1008 SRI SATYATMA TIRTHA SRI PADA

Tuesday, September 23, 2014

శ్రాద్ధములో పూజింపబడే పితృదేవతలు అనగా ఎవరు?
ఈ సందేహము పాండవ జ్యేష్ఠుడైన యుధిష్ఠురిడికి ( అనగా శ్రాద్ధదేవ అను పేరు ఉన్న యమధర్మరాజుగారి అవతారము) కలగగా ఈ సందేహమును నివృత్తి చెసినవారు భీష్మాచార్యులు. అంటే యుధిష్ఠురిడికి తెలియదు అని కాదు కాని మనకు తెలియజేయాలని ఆ మహనీయుడి అభిప్రాయము. అట్టి గహనమైన విషయము మనము అందరము తెలిసుకొనవలసినదే.
యుధిష్ఠిరుడి సందేహము ఏమనగా! ప్రతీ జీవి తను చేసిన కర్మముల ప్రతిఫలమును అనుభవించుటకు స్వర్గమో, నరకమో మరి వేరె ఏదైనా లోకమునకు ఏగినప్పుడు, అచటనే ఉండు అనివార్య పరిస్ధితులను దాటుకొని ఇచట కర్మభూమి అయిన మన భారతముదేశములో వారి వారి సంతానము జేయు శ్రాద్ధమును స్వీకరించుటకు రావడము ఎలా సాధ్యము? కొన్ని జీవులు నరక లోకములో నుండగా ఇచటకు రావడము వారికి ఇంకను అసాధ్యము, మరి కొన్ని జీవులు కర్మవశమున క్రూరమృగాలుగా, లేదా మరియొక పశుయోనిలో నుండగా మనము మన ఇళ్ళలోనో, దైవసన్నీధానముతో పవిత్రమైన మఠములలోనో లేదా దేవాలయాలలోనో శ్రాద్ధము చేయగా అచట మన పితృవులు వచ్చి ఆశీర్వాదము చేయుటకు ఎలా సాధ్యము?
ఇట్టి సందేహము వెనక స్వయముగా భీష్మాచార్యులకును కలుగగా సంక్షిప్తముగా వారి జన్మదాతలైన శంతను మహారాజుగారు పరిహరించిరి.
ఈ సందేహపరిహారము ఏమనగా, శ్రాద్ధమునకు వచ్చి మనులను ఆశీర్వదించు మన జన్నదాతలు ఎవరో, వారే స్వయముగా రారు, కాని, మన జన్మదాతల రూపములను ధరించి మనకు ఆశీర్వదించి వెళ్ళువారు చతుర్మఖ బ్రహ్మ దేవుని కుమారులైన పితృగణదేవతలు, వీరి లోకము స్వర్గముకన్ననూ ఊర్ధ్వ లోకములలో అనగా సోమలోకములో నుండును, మనము శ్రాద్ధవిధితో వీరిని తృప్తి పరచగా వీరు, కర్మవశమున ఏ లోకములోనైనూ, ఏ అవస్థలోనున్ననూ మన జన్మదాతలైన మాతా పితృువులను త్రప్తి పరుచురు, శ్రాద్ధవిధి ఎందు మన శ్రద్ధని చూసి సర్వలోకములనే తృప్తి పరుచువారు.
ఇట్టి ఈ పితృగణదేవతల ఏడు ప్రకారాలుగా శాస్త్రములో వర్ణించబడినది,
  1. విరాజ ప్రజాపతిగారి కుమారులు వైరాజ పితృగణము, దేవతలు వీరిని విశేషముగా పూజించురు.
  2. మరీచి ప్రజాపతులవారి కుమారులు ఆగ్నీష్వాత్తా పితృగణము, వీరూ దేవతలచే పూజింపబడువారు.
  3. ప్రజాపతి పులస్త్యులవారి కుమారులు బర్హిషద అను పేరు కలిగిన పితృగణము, వీరిని దేవతలు, యక్ష గంధర్వ రాక్షసులు, నాగములు,సర్పములు, గరుడుడు మొదలగు పక్షిశ్రేష్ఠులు పూజించురు.
  4. వశిష్ఠ ప్రజాపతుల కుమారులు సుకాలా నామకులగు పితృగణము, వీరిని బ్రాహ్మణులు ఆరాధించురు.
  5. అంగీరస ప్రజాపతుల కుమారులు ఆంగీరస పితృగణము, వీరిని క్షత్రయులు ఉపాసన చేయుదురు.
  6. పులహ నామము కలిగిన ప్రజాపతుల వారి కుమారులు సుస్వధా నామకులైన పితృగణము, వారిని వైశ్యజాతికి చెందినవారు పూజింతురు.
అగ్ని ప్రజాపతి (అగ్నిదేవుడు) గారి కుమారులు సోమపా పితృగణము, వీరిని శూద్రులు పూజించురు.
ఈ సప్త సంఖ్యలో ఉన్న పితృగణ దేవతలకు సంభంధించిన ఆసక్తికరమైన కథలు ఎన్నో ఉన్నాయి. వాటిని విస్తారముగా నా అంతర్జాలములో (website,narasimhacharyasulibhavi.org) లో వ్రాసిఉంచెదను.
సశేషము...
అస్మత్ పితృంతర్గత శ్రీ భారతీ రమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీ జనార్దన ప్రీయతామ్ ప్రీతోవరదో భవతు.


శ్రీ కృష్మార్పణమస్తు.
नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

Sunday, September 21, 2014

శ్రాద్ధానికి నల్లని నువ్వులు, సరియు దర్భములను తప్పనిసరిగా ఎందుకు వాడతారు?

ఈ ప్రశ్న చాలామందికి వచ్చి ఉండోచ్చు, అలాగె చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండోచ్చు, రెండవ క్రోవకి చెందిన వారిని మనము పట్టించుకోకుండా ఉండడమే మేలు. "శ్రాద్ధము" అనే శబ్దములోనె శ్రద్ధతో చేయవలసినది (యత్ శ్రద్ధయా క్రీయతె తత్ శ్రాద్ధం), కాని నేటి సమాజములో చాలామందికి శ్రద్ధ లేదు, ఏదో మొక్కుబడిగా ముగించాము అని అనిపించుతారె తప్ప ఏమి చేసాము, ఎందుకు చేసాము అనేదె తెలియదు.
జన్మదాతల ఋణము శరీరము చనిపోయేంతవరకు ఉంటుంది, కాబట్టే మన తల్లిదండ్రులు చనిపోయాక కూడా, వారి పాంచభౌతిక శరీరము నశించినా వారి ఋణమును తీర్చుకొనుటకు మనము వారి తదనంతరము మరియు మనము జీవించి ఉన్నంతవరకు వారి కోసము శ్రాద్ధ తర్పణాదులు చేయవలసినదే!.
ఈ శ్రాద్ధ తర్పణాదులు అనగా మనకు గుర్తు వచ్చేదె నల్ల నువ్వులు మరియు దర్భములు. ఈ రెండు మనము శ్రాద్ధాని కార్యాలలో ఎందుకు వాడాలి అన్నదానికి కొన్ని సమాధానములు ఇచ్చట ప్రస్తావించుచున్నాను.

గరుడునికి శ్రీ మహావిష్ణువు ఇలా ఉపదేశించారు.

మ స్వేదసముద్భూతాః తిలాః తార్క్ష్య పవిత్రకాః | అసురాః దానవా దైత్యా విద్రవన్తి తిలైస్తథా ||
తిలాః శ్వేతాః తిలాః కృష్ణాః తిలాః గోమూత్ర సన్నిభాః | దహన్తు తే మే పాపాని శరీరేణ కృతాని వై ||
ఏకఏవ తిలో దత్తో హేమద్రోణ తిలైః సమః | తర్పణె దానహోమేషు దత్తో భవతి అక్షయః ||
భావము- నువ్వులు మూడురకాలు తెలుపు, నలుపు మరియు గోమూత్రమువలె బంగారు రంగులో ఉండును. ఏ రంగు నువ్వులు (తిలము) అయినను, తిలము ఇది చిన్మయుడైన నిర్దోషుడు, అనంత గుణపూర్ణుడు అయిన జగత్స్వామి శ్రమరహితుడు అయిన శ్రీ మన్నారయణుని స్వేదము చే సృష్టించబడినది. కావున ఇట్టి తిలములను ఒకటైననూ శ్రాద్ధములో సమర్పితమైననూ బంగారు కుంభంలో నింపిన సువర్ణ తిలములను దానము ఇచ్చినంత పుణ్యము, అక్షయమైన ఫలమును ప్రసాదించును, అంతే కాకుండ ఎచట తిలములు ఉండునో అచట దైత్యులు, పిశాచాలు, రాక్షసులు మొదలగువారు పారిపోదురు, తన్నిమిత్తంగా నిర్విఘ్నముగా చేపట్టిన కార్యము సమాప్తి చెందును. మన శరీరముచే చేసిన పాపములు అన్నియు నశించును. కావున మనము శ్రాద్ధము మొదలగు కర్మముల ఎందు తిలములను వాడుట పరిపాటి, సంప్రదాయము.
ఇక దర్భముల వైశిష్ట్యము తెలుసుకుందాము.
దర్భాః రోమసముద్భూతాః తిలాః స్వేదేషు నాన్యథా | దెవతా దానవాః తృప్తాః శ్రాద్ధేన పితరస్తథా ||
ప్రయోగవిధినా బ్రహ్మా విశ్వం చాప్యుప జీవనాత్ | అపసవ్యాదితో బ్రహ్మా పితరో దేవదేవతాః ||
తేన తె పితరః తృప్తా అపసవ్యే కృతె సతి | దర్భమూలె స్థితో బ్రహ్మా మధ్యే దేవో జనార్ధనః ||
దర్భాగ్రే శఙ్కరం విద్యాత్ త్రయో దేవాః కుశే స్మృతాః | విప్రా మన్త్రాః కుశా వహ్నిస్తులసీ చ ఖగేశ్వర ||
నైతె నిర్మాల్యతాం యాన్తి క్రియమాణాః పునఃపునః | తులసీ బ్రాహ్మణా గావో విష్ణురేకాదశి ఖగ ||
పఞ్చ ప్రవహణాన్యేవ భవాబ్ధౌ మజ్జతాం నృణామ్ | విష్ణురేకాదశీ గీతా తులసీ విప్రధేనవః ||
భావము- తిలములు భగవంతుని చిన్మయుడైన నిర్దోషుడు, అనంత గుణపూర్ణుడు అయిన జగత్స్వామి శ్రమరహితుడు అయిన శ్రీ మన్నారయణుని స్వేదము చే సృష్టించబడినది, అటులనే దర్భములు భగవంతుని రోముమలనుండి సృష్టించబడినవి. ఇట్టి దర్భములను శ్రాద్ధవిధిలో మంత్ర సహితంగా ఉపయోగించినచో సమగ్ర సజ్జన సముదాయము, సమస్త విశ్వము, పితృదేవతలు, దేవతోత్తములు తృప్తి చెందురు. అపసవ్యమును ఒనర్చినచో ఉపజీవించురు సంతోషించుదురు, సంతృప్తి చెందురు. కావున మనము శ్రాద్ధము చేయు సందర్భములో మంత్ర మంత్రానికి అపసవ్యము ఒనర్చుదము.
దర్భముయొక్క మూలభాగమున చతుర్ముఖ బ్రహ్మదేవుడు, మధ్యభాగములో శ్రీ మన్నారాయణుడు, అగ్రభాగమున రుద్రదేవుడు సన్నిహితులై ఉండురు. త్రిమూర్తుల సన్నిధానముతో పవిత్రమైన దర్భము ఉన్నచోట పిశాచముల, దుష్టశక్తుల పీడ ఉండదు. కావున దర్భములు ఉన్నచోట శుభములు కలుగును.
  1. బ్రాహ్మణులు, మన్త్రములు, దర్భములు, అగ్ని, తుళసీ వీటికి మైలము, అశుద్ధి మొదలగు దోషములు లేవు.
  2. అలాగే తుళసి, బ్రాహ్మణులు, గోవులు, శ్రీ మహావిష్ణువు, ఎకాదశి నిర్జల ఉపవాసము ఇవి అయిదు భవసాగరములో మునిగి నశించు మానవమాత్రులకు, ఒక పడవవలె ఆశ్రయము ఇచ్చి భవసాగరమును దాటించును.
  3. శ్రీ మహావిష్ణువు, ఎకాదశి ఉపవాసము, భగవద్గీతా, తుళసి, బ్రాహ్మణులు, గోమాతలు ఈఆరు మోక్షమును ప్రసాదించును.
  4. అసారమైన , అశుద్ధమైన ఈ సంసారములో అత్యంత పవిత్రమైనవి తిలములు, దర్భములు మరియు తుళసి. మనకు సంభవించు దుర్గతునుండి రక్షించును.

సర్వ పితృంతర్గత భారతీ రమణ శ్రీ ముఖ్యప్రాణాంతర్గత శ్రీ కృష్ణార్పణమస్తు
नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa

Tuesday, September 9, 2014

today sri yadpati acharya's punya dina, yadpati acharya(yaadavaaryaru) is a greatest scholar of india, a very much noted tippanikaara. he is shishya of vedesh tirtharu, whose moola brindavana is in manur. वेदेश मुनिन सत्पादसेवा संप्राप्त वैभवान् । यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः ।। a great bhakta of sri hari, nowadays also many peethadhipatis of sri madhwa sampradaya follow his commentary. sri yadupati acharyaru has written commentary of sri mad bhagavata, sri man nyaya sudha and many more granthas. A heart watering incident was happened in his life, there are many such events in his great story, but i am presenting only one here. Yaadavaarya a great devotee of Sri hari, was a rich person, but he left all his earnings with detachment, there were many disciples who studied in his guidance, yadrichha laabha samtrupti was his life time principle (he never tried or wasted his time in earning wordly things) what ever reaches him with God's grace with out asking any body he used to settle down with that thing for the whole day. once fora few days nothing was available for the feed of his shishyas, not even a single grain of rice, yadupati acharyas wife a saadhvi shiromani told the same and felt very depressed for the situation of all the shishyas who were with empty stomachs for few days, at this point of life yadupati acharya felt that " the God has neglected me, the geeta verse अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते। तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं ।। this verse says that the devotee who had himself deeply devoted to the God need not to worry for anything because their yoga (fulfilling of any deficit ) kshemam (safeguarding the acquired things) is my responsibility, hence my bhaktas won't need to worry. but in my case this is not proved hence may be this verse of geeta is not of the Lord Krishna" he thought this and underlined the same with red ink. meanwhile their at the yadupati acharyas abode a handsome prince approached yaadavaaryas wife with a wounded tongue, and many riches and told that "oh mother! your husband has wounded my tongue, for the delay in approaching you with this riches, i apologize" he told this and went away. when yadupati acharya reached back home he was surprised in seeing all the riches, and asked from where these have come to us, for this question his wife was surprised too and told what had happened in his absence and felt sorry for the wound her husband had done to the prince. yadupati acharya's heart was full of joy and at the same time full of remorsation (pachattapamu). the prince was Lord Krishna himself, this was known by sri yadupati acharya, and with this incident he never ever felt sorry for the ups and downs of life. such a great person should be a role model for all of us.
नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com

you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa