my vidya guru

my vidya guru
AATMODDHARAKA SRI 1008 SRI SATYATMA TIRTHA SRI PADA

Saturday, December 28, 2013

శివకేశవులకు భేదమా అభేదమా?


28-12-2013
చాగంటి కోటేశ్వరరావు మొదలైన ఉపన్యాసకులు శివకేశవులకు అభేదము అని సామాన్యంగా అన్ని ఉపన్యసాలలో చెబుతు ఉంటారు, కాని సమగ్రమైన శాస్త్రాలకు మరియు పురాణాలకు, వేదాలకు సమ్మతమైన తత్వం కాదు.
శివకేశవులకు అభేదము లేదు భేదమే ఉంది అను విశయాన్ని సమర్ధిస్తు ఇచట కొన్ని ఆధారాలను, ప్రమాణాలను ప్రస్తావిస్తున్నాను.
  1. అంభ్రణి సూక్తము---: “అహం రుద్రాయ ధనురాతనొమి బ్ర్మద్విషే శరవే హంతవావు” అను మంత్రాన్ని చెబుతు చతుర్ముఖ బ్రహ్మ దేవుడు మరియు రుద్రదేవుడు(శివుడు) వీరిని వేరుగా ప్రస్తావించి ప్రసంగానికి అనుకూలంగా “మమ యోనిరప్స్వా అంతః సముద్రే” అను వేదమంత్రములో నాకు కారణమైనవాడు స్వామి నారాయణుడు అని సాక్షాత్ లక్ష్మీదేవి శివకేశవులకు భేదాన్ని తెలిపింది. ఇలాగే యన్నొ వేదమంత్రములు శివకేశవులకు అభేదాన్ని సమర్థిస్తున్నాయి. “ఏకో నారాయణ ఆసీత్ న బ్రహ్మ న చ శంకరః” అను వేదమంత్రము స్పష్చంగా శివకేశవులకు మరియు బ్రహ్మదేవుడికి భేదము చెబుతున్నాయి.
  2. భాగవత పురాణమే మొదలగు ఇతిహాస పురాణములను చూస్తే అవికూడా శివకేశవులకు భేదమును సమర్థిస్తున్నాయి. చతుర్థస్కంద భాగవతములో స్వయంగా శివుడే తను శ్రీమన్నారాయణుని మనుమడిని భక్తుడిని అని సమర్థిచుకున్నారు (అథ భాగవతాః యూయం ప్రియాః స్థ భగవాన్ యథా। న మే భాగవతానాం చ ప్రేయానన్యోఁస్తి కర్హిచిత్ ।।) అని చెప్పే సందర్భములో.
  3. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏకాదశ అధ్యాయములో విశ్వరూపాన్ని చూపించిన సందర్భములో అర్జునుడు మరియు సమస్త దేవతాసముదాయము, ఋషిసముదాయము కూడా శివకేశవులకు స్పష్టంగా భేదాన్నె ప్రత్యక్షంగా చూసారు అర్జున ఉవాచ_ పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేష సఙ్ఘాన । బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ।। ఈ శ్లోకములో అర్జునుడు బ్రహ్మ రుద్రాది సమస్త ప్రపంచాన్ని భగవంతుడికి భిన్నంగానే చూసాడు.
  4. త్యాగరాజు వారి కీర్తనలలో పార్వతి మాతను స్తోత్రము చేస్తు శ్రీహరికి సోదరి అని పార్వతిమాతను స్తుతించారు, ఒకవేళ శివకేశవులకు అభేదమైతే పార్వతిమాత శ్రీహరి సోదరి ఎలా అవుతుంది “అంబ నిను నమ్మితి ” అను కీర్తనలో స్పష్టంగా “శంబరవైరి జనక సోదరి” అని స్తుతించారు, వివరణ_ శంబరవైరి అంటె ప్రద్యుమ్నుడు శంబరాసురుని సంహరించింది ప్రద్యుమ్నుడు అను మాట భాగవత ప్రసిద్ధం, శంబరవైరి జనకుడు అంటే ప్రద్యుమ్నుడి జనకుడు శ్రీకృష్ణుడు కావున పార్వతిమాత శ్రీహరి సోదరి అయినప్పుడు శివకేశవులు ఒకరే ఎలాఅవుతారు, ఇవే మొదలైన ఎన్నో ఆధారాలు ప్రమాణాలను చూసి శివకేశవులకు స్పష్టంగా భేదమే ఉంది , ఇద్దరు ఒకరు ముమ్మాటికి కారు.
రచన
నరసింహాచార్య సుళీభావి
శ్రీకృష్ణార్పణమస్తు

नरसिंहाचार्य सुळिभावि
मठाधिकारि,
गुंटूर, उत्तरादिमठम्
MOB-7396765108 visit my blog: HTTP://narasimhacharyasulibhavi.blogspot.com
to join my sms channel send sms as [ON] space [NARASIMHACHARYASULIBHAVI] to mobile number 9870807070
or http://labs.google.co.in/smschannels/subscribe/narasimhacharyasulibhavi go to this link online
you can see my prashnottara on uttaradimatham's official website uttaradimath.org in the category adhyatma jignyasa